logo

పోడుభూములకు హక్కు పత్రాలివ్వాలి: భట్టి

పోడు భూములకు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టాలిచ్చిందని, తెరాస ప్రభుత్వం ఇంతవరకు ఎకరానికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ఆజాదీకా అమృత్‌ యాత్రలో

Updated : 12 Aug 2022 02:44 IST

కొణిజర్ల, న్యూస్‌టుడే: పోడు భూములకు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టాలిచ్చిందని, తెరాస ప్రభుత్వం ఇంతవరకు ఎకరానికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ఆజాదీకా అమృత్‌ యాత్రలో భాగంగా కొణిజర్ల మండలం తనికెళ్ల నుంచి పల్లిపాడు వరకు పాదయాత్ర గురువారం సాగింది. మహిళలు బోనాలు, కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. తనికెళ్ల సమీపంపలోని విజయ కళాశాల నుంచి మధ్యాహ్నం ప్రారంభమైన యాత్ర తనికెళ్ల, కొణిజర్ల మీదుగా పల్లిపాడు వరకు కొనసాగింది. భట్టి విక్రమార్క సతిమణి మల్లు నందిని, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు సతీమణి పోట్ల మాధవి పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలు అధికంగా పెరిగాయని, సంపదను బహుళజాతి సంస్థలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్తును కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నియోజకవర్గ నాయకులు బానోత్‌ బాలాజి, రాందాసునాయక్‌, వడ్డే నారాయణరావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని