logo

ఆసరాపై ఆశలు..

జిల్లాలో సుదీర్ఘ కాలంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించినట్లైంది. 2018 తర్వాత జిల్లాలో కొత్తగా ఒక్క పింఛన్‌ మంజూరు కాలేదు. కాలక్రమంలో లబ్ధిదారుల్లో

Published : 12 Aug 2022 01:55 IST

కేబినెట్‌ నిర్ణయంతో దరఖాస్తుదారుల్లో ఆనందం

ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో సుదీర్ఘ కాలంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించినట్లైంది. 2018 తర్వాత జిల్లాలో కొత్తగా ఒక్క పింఛన్‌ మంజూరు కాలేదు. కాలక్రమంలో లబ్ధిదారుల్లో మరణిస్తే వారికి పింఛన్లు ఆపినప్పటికీ కొత్తగా మాత్రం ఎవరికీ ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకొని నిరీక్షిస్తున్నారు. వారిలో దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కళాకారులు, ఫైలేరియా బాధితులున్నారు. అధికారులు చుట్టూ తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖాస్తుదారులకు ఏం సమాధారం చెప్పాలో తెలియక మిన్నకుండిపోయేవారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 57ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం అది అమలు కాలేదు. అయినా వృద్ధులు వాటి కోసం అధికారుల చుట్టూ తిరిగేవారు. చాలా మంది పింఛన్‌దారులు వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్ల కోసం 23,294 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర కేబినేట్‌ భేటీలో స్వతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో దరఖాస్తుదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని