logo

విద్యారంగానికి శేషుకుమార్‌ సేవలు మరువలేనివి: నామా

‘ట్రస్మా’ రాష్ట్ర అధికారి ప్రతినిధి, నిర్మల స్కూల్‌ కరస్పాండెంట్‌ సూరపనేని శేషుకుమార్‌ చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి విద్యారంగానికి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలో

Published : 12 Aug 2022 01:55 IST

సంస్మరణ సభలో మాట్లాడుతున్న ఎంపీ నామా నాగేశ్వరరావు, వేదికపై కమల్‌రాజు తదితరులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ‘ట్రస్మా’ రాష్ట్ర అధికారి ప్రతినిధి, నిర్మల స్కూల్‌ కరస్పాండెంట్‌ సూరపనేని శేషుకుమార్‌ చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి విద్యారంగానికి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలో గురువారం జరిగిన శేషుకుమార్‌ సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ఫెమా కన్వీనర్‌ మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత శేషుకుమార్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ఎంతో అండగా నిలిచి అనేక సమస్యల పరిష్కారం కోసం శేషుకుమార్‌ కృషి చేశారని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ విద్యాలయాల సమస్యలపై శేషుకుమార్‌ అనేక పోరాటాలు నిర్వహించారని, ఆయన జీవితం ఆదర్శమన్నారు. జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు, వైరా ఎమ్మెల్యేలు ఉపేందర్‌రెడ్డి, రాములు నాయక్‌, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వివిధ పార్టీల నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, మల్లునందిని, కూరపాటి వెంకటేశ్వర్లు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, కార్యదర్శి మధుసూదన్‌, కోశాధికారి ఐవీ రమణారావు, జిల్లా అధ్యక్షుడు బొగ్గారపు రాంచందర్‌రావు, టీపీజేఎంఏ రాష్ట్ర నాయకుడు వీరారెడ్డి, చల్లా శేషగిరి, ప్రభాకర్‌రెడ్డి, రవిమారుత్‌, సీహెచ్‌జీకే ప్రసాద్‌, కేసా వీరన్న, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ నామాతో పాటు పలువురు మొక్కలు నాటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని