logo

దేశ సంపదను నాశనం చేస్తున్న మోదీ: భట్టి

నియంతలా మారిన ప్రధాని మోదీ దేశ సంపదను నాశనం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. భట్టి చేపట్టిన యాత్ర శుక్రవారం వైరా పట్టణానికి చేరుకుంది. క్రాస్‌రోడ్డులో జరిగిన సభలో మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వ రంగ

Published : 13 Aug 2022 02:46 IST

వైరాలో భట్టి పాదయాత్రకు హాజరైన కార్యకర్తలు

వైరా, న్యూస్‌టుడే: నియంతలా మారిన ప్రధాని మోదీ దేశ సంపదను నాశనం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. భట్టి చేపట్టిన యాత్ర శుక్రవారం వైరా పట్టణానికి చేరుకుంది. క్రాస్‌రోడ్డులో జరిగిన సభలో మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను దేశానికే తలమానికంలా కాంగ్రెస్‌ మారిస్తే వాటిని కార్పొరేట్‌ వర్గాలకు ధారాదత్తం చేయడం కోసం మోదీ కుట్ర పన్నారన్నారు. అంబానీ, అదానీలకు దేశ ఆస్తులు కట్ట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటంతో సాధించుకున్న దేశ స్వాతంత్య్ర ఘట్టంలో భాజపాకు అణువంతైనా చోటులేదన్నారు. గాంధీలకంటే గాడ్సేలే భాజపా దృష్టిలో నాయకులుగా మారారన్నారు. దేశంలో భాజపా, రాష్ట్రంలో తెరాస పాలన సాగిస్తే అంధకారం, అథోగతి తప్ప మరేంమిగలదన్నారు. నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సౌజన్య, పోట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని