logo

Nara Brahmani: నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తికి దేహశుద్ధి

సామాజిక మాధ్యమంలో నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తికి ఖమ్మం తెదేపా నాయకులు గురువారం దేహశుద్ధి చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ అనే వ్యక్తి ఖమ్మం టేకులపల్లిలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు.

Updated : 30 Sep 2022 08:06 IST

ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమంలో నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తికి ఖమ్మం తెదేపా నాయకులు గురువారం దేహశుద్ధి చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ అనే వ్యక్తి ఖమ్మం టేకులపల్లిలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. తన ఫేస్‌బుక్‌లో ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణిపై అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా కించపరుస్తూ పోస్టులు పెట్టాడు. విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు కేతినేని హరీశ్‌, నల్లమల రంజిత్‌, నున్నా నవీన్‌, వక్కంతుల వంశీ తదితరులు కోదాటి నరసింహను చరవాణిలో ప్రశ్నించటంతో ముస్తఫానగర్‌ వైతెపా కార్యాలయంలో ఉన్నానని చెప్పారు. అక్కడికి వెళ్లి వ్యక్తిగతంగా ఎందుకు పోస్టులు పెట్టావని అడగటంతో దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాయకులు సదరు వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం తెదేపా లోక్‌సభ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నారా, నందమూరి కుటుంబాలకు చెందిన వ్యక్తులపై వ్యక్తిగతంగా అసభ్య పదజాలం వాడితే సహించేది లేదని హెచ్చరించారు.

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts