logo

సెప్టెంబరు 30 వరకూ గెలలు తెచ్చిన రైతులకు ఊరట

సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో అశ్వారావుపేట, అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమలకు రైతులు తెచ్చిన ఆయిల్‌పాం గెలలకు అదే నెల రేటు వర్తించే అంశంపై టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌, ఎండీ సానుకూలంగా స్పందించారని రైతు సంఘ నాయకులు తెలిపారు.

Published : 05 Oct 2022 04:16 IST

టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కె.రామకృష్ణారెడ్డిని కలిసిన రైతు సంఘ ప్రతినిధులు

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో అశ్వారావుపేట, అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమలకు రైతులు తెచ్చిన ఆయిల్‌పాం గెలలకు అదే నెల రేటు వర్తించే అంశంపై టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌, ఎండీ సానుకూలంగా స్పందించారని రైతు సంఘ నాయకులు తెలిపారు. ఈ అంశంపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేంద్రతో మంగళవారం చరవాణిలో మాట్లాడారు. ఛైర్మన్‌, ఎండీలను ఆయిల్‌పాం రైతుల సంక్షేమ సంఘం నాయకులు ఆలపాటి రామచంద్రప్రసాదు, శీమకుర్తి వెంకటేశ్వరరావు, కందిమళ్ల కృష్ణారావు స్వయంగా కలిసి సమస్యను వివరించారు. కర్మాగారానికి చివరి రోజుల్లో తెచ్చిన 500 ట్రాక్టర్ల సరకు దిగుమతి కాలేదని, దీంతో రైతులు సుమారు రూ.70లక్షల మేర నష్టపోయారని వివరించారు. దీనిపై ఈ నెల 2న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. సమన్యను విన్న ఛైర్మన్‌, ఎండీ రైతులకు అన్యాయం జరగని రీతిలో చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts