logo

వాగులో పడి బాలుడి మృతి

ములకనాపల్లి గ్రామంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఉయికా దాసు(7) మంగళవారం సాయంత్రం సమయంలో ముగ్గురు స్నేహితులతో కల్సి సమీపంలో ఉన్న వాగులో స్నానం చేయడానికి వెళ్లాడు.

Published : 05 Oct 2022 04:16 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ములకనాపల్లి గ్రామంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఉయికా దాసు(7) మంగళవారం సాయంత్రం సమయంలో ముగ్గురు స్నేహితులతో కల్సి సమీపంలో ఉన్న వాగులో స్నానం చేయడానికి వెళ్లాడు. స్నానం చేస్తున్న సమయంలో వాగు లోతు అంచనా వేయలేకపోయాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై రవికుమార్‌ను వివరణ కోరగా తన దృష్టికి రాలేదని తెలిపారు.


ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తి దుర్మరణం

చంద్రుగొండ, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడ్డ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ విజయలక్ష్మి కథనం ప్రకారం.. సీతాయిగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలో దుక్కిదున్ని మంగళవారం రాత్రి తిరిగి బయల్దేరింది. దానిపై సీతాయిగూడేనికి చెందిన కోండ్రు రవి (32) అనే వ్యక్తి కూర్చొన్నాడు. మహ్మద్‌నగర్‌ సమీపంలోని ప్రధాన రహదారిపై అతి వేగంగా వెళ్తూ అదుపుతప్పి బోల్తా పడటంతో రవి ట్రాక్టర్‌ కింద పడి మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు. మృతునికి భార్య ముత్తమ్మ, ముగ్గురు పిల్లలున్నారు. ఎస్‌ఐ విజయలక్ష్మి ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం తరలించారు.

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts