కృష్ణాపురం వద్ద రోడ్డు ప్రమాదం

కృష్ణాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... బోనకల్లు మండల జానకీపురానికి చెందిన కె.వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై మధిరకు వస్తున్నారు.

Updated : 05 Oct 2022 05:51 IST

ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు

మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... బోనకల్లు మండల జానకీపురానికి చెందిన కె.వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై మధిరకు వస్తున్నారు. కృష్ణాపురం వద్ద ముందు వెళ్తున్న బస్సును దాటి వెళ్లే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ఇతని వెనక ద్విచక్ర వాహనంపై వస్తున్న కలకోట గ్రామానికి చెందిన ఎన్‌.వెంకటేశ్వర్లు, మహ్మద్‌ సైతం వేగం అదుపు చేసుకోలేక కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంతో ముగురికీ గాయాలు కావటంతో 108లో మధిర వైద్యశాలకు, అనంతరం ఖమ్మం తరలించారు.

ద్విచక్ర వాహనదారుకు తీవ్ర గాయాలు

ఖమ్మం అర్బన్‌, న్యూస్‌టుడే: ఆగి ఉన్న లారీని ఢీకొని ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడిన సంఘటన నగర శివారు ధంసలాపురం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారô... చింతకానికి చెందిన నల్లమాసు వీరబాబు ఎఫ్‌సీఐలో పనిచేస్తున్నాడు. ఖమ్మం నుంచి రాత్రి సుమారు 8.30గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఎస్‌ఆర్‌ హోమ్స్‌ వద్ద మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. క్షతాత్రుడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

కారు బోల్తా..

ముదిగొండ, న్యూస్‌టుడే: గోకినేపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు మంగళవారం రాత్రి ఓ కారు బోల్తా పడింది. కోదాడకు చెందిన ఓ కుటుంబంలో మొత్తం 8 మంది సభ్యులు ఖమ్మం నుంచి కోదాడకు కారులో వెళ్తున్నారు. రహదారి  మూలమలుపును పూర్తిగా గమనించకపోవటంతో ప్రమాదవశాత్తు కారు రోడ్డు పక్కన ఉన్న గోతిలో బోల్తా పడింది. అందులో ఉన్నవారిని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిలో నలుగురు చిన్నారులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని