logo

పంజర వలకు ప్రోత్సాహం కరవు

అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంఖ్యలో చేపలను పెంచగలిగే పద్ధతి.. పంజర వల విధానం. నిర్ణీత ప్రాంతంలో వలల మధ్య అధిక సాంద్రత విధానంతో కృత్రిమంగా ఆహారం ఇచ్చి చేపలను పెంచే అవకాశం ఈ విధానంతో సాధ్యమవుతుంది.

Updated : 05 Oct 2022 04:53 IST

పంజరవల విధానంతో చేపల పెంపకం తీరును పరిశీలిస్తున్న రాష్ట్రస్థాయి అధికారులు (దాచిన చిత్రం)

కూసుమంచి, న్యూస్‌టుడే: చేపల పెంపకానికి సరైన ప్రోత్సాహం లభించడం లేదు.. పంజర వల విధానంలో మత్స్యకారులు వాటాధనం చెల్లించి ఏడాది గడిచినప్పటికీ ఎదురుచూపులే మిగులుతున్నాయి..  

అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంఖ్యలో చేపలను పెంచగలిగే పద్ధతి.. పంజర వల విధానం. నిర్ణీత ప్రాంతంలో వలల మధ్య అధిక సాంద్రత విధానంతో కృత్రిమంగా ఆహారం ఇచ్చి చేపలను పెంచే అవకాశం ఈ విధానంతో సాధ్యమవుతుంది. ప్లాస్టిక్‌ డ్రమ్ములు లేదా ఫోటింగ్‌ కేజెస్‌(నీట మునగని డబ్బాలు)కు వలలను వేలాడ దీసి జలాశయంలోనే నిర్ణీత ప్రాంతంలో నిలిపి ఉంచి వాటిలో చేపలను పెంచే విధానం ఝార్ఖండ్‌ రాష్ట్రంలో అమలులో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి పాలేరు జలాశయంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఒక్క యూనిట్ ఖర్చు రూ.30 లక్షలు కాగా, 20 శాతం వాటాధనాన్ని మత్స్యకారులు సమకూర్చాల్సి ఉంటుంది. 80 శాతం ప్రభుత్వం రాయితీనిస్తోంది. ఈక్రమంలో పాలేరులో 2016లోనే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. 2017 మరింతగా విస్తృతపరిచారు. మరింతగా ప్రోత్సహిస్తాని మంత్రులు అధికారులు, హామీనిచ్చారు.

వాటాధనం చెల్లించి ఏడాది

ప్రస్తుతం పాలేరు జలాశయంలో 10 యూనిట్ల ద్వారా చేపల పెంపకం సాగుతోంది. తద్వారా 100 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. మంచి ఆదాయం గడిస్తున్నారు. ఈక్రమంలో తమనూ ప్రోత్సహించాలంటూ మరో వంద మంది మత్స్యకారులు 10 గ్రూపులుగా ఏర్పడి ఒక్కొక్కరు రూ.60 వేల చొప్పున వాటాధనం చెల్లించారు. ఏడాది గడుస్తున్నప్పటికీ మంజూరు లభించకపోవడంతో ఎదురుచూపులే వారికి శరణ్యమయ్యాయి.


ప్రభుత్వానికి ప్రతిపాదించాం
బి.శ్రీనివాస్‌, జీఎం రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య

పాలేరు మత్స్యకారులు పది గ్రూపులుగా ఏర్పడి పంజరవల విధానంతో చేపల పెంపకం కోసం తమ వాటాధనం చెల్లించి ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని