logo

గ్రూప్‌-1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్‌

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షలు ఈ నెల 16న పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. జిల్లాలోని అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 17,366 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని,

Updated : 05 Oct 2022 04:55 IST

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షలు ఈ నెల 16న పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. జిల్లాలోని అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 17,366 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకోసం 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలను 13 రూట్లుగా విభజించి ప్రతి రూట్‌కు లైజన్‌ అధికారిని నియమించామన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి వసతులు ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల కళాశాల ప్రిన్సిపాళ్లతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల రూట్‌ మ్యాప్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రంలో ఏం చేయాలి? ఏం చేయకూడదో? వివరించాలన్నారు. బయోమెట్రిక్‌ హాజరు ఉంటుందని, గంట ముందుగా పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్‌ మాట్లాడుతూ భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, డీఆర్వో శిరీష, అదనపు డీసీపీ బోస్‌ తదితరులు పాల్గొన్నారు.

* ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్జేసీ కళాశాల, ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ గౌతమ్‌ తనిఖీ చేశారు. పార్కింగ్‌, టాయిలెట్స్‌, తాగునీరు, డ్యూయల్‌ డెస్క్‌లు పరిశీలించారు. సైన్‌ బోర్డుల ఏర్పాటుపై పలు సూచనలిచ్చారు. పరీక్ష రాసే అభ్యర్థుల సిట్టింగ్‌ ఏర్పాట్లు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని