గజ్జె కట్టి.. అవార్డులు పట్టి..
సంప్రదాయ కళల పరిరక్షణ ఉద్యమంలో చిన్ననాటి నుంచే నడుం కట్టింది ఈ చిన్నారి.. ఓ వైపు చదువులో ప్రతిభను చాటుతూనే తనలో ఉన్న నాట్య ఆసక్తికి మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతోంది.
శాస్త్రీయ నృత్యంలో చిన్నారి ప్రతిభ
మధిర పట్టణం, న్యూస్‌టుడే
సంప్రదాయ కళల పరిరక్షణ ఉద్యమంలో చిన్ననాటి నుంచే నడుం కట్టింది ఈ చిన్నారి.. ఓ వైపు చదువులో ప్రతిభను చాటుతూనే తనలో ఉన్న నాట్య ఆసక్తికి మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతోంది. సెలవు రోజుల్లో నాట్య ప్రతిభను పలు వేదికలపై ప్రదర్శిస్తూ ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. మధిరలోని గీతా మందిరం రోడ్డుకు చెందిన 9వ తరగతి చిన్నారి ముత్తవరపు ఉజ్విత.
అందుకున్న అవార్డులెన్నో..
ఉజ్విత రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు ప్రముఖ సంస్థల నుంచి శాస్త్రీయ, కూచిపూడి నృత్యంలో అవార్డులందుకుంది. భాషా సాంస్కృతిక శాఖ, రాజమండ్రికి చెందిన మువ్వగోపాల కల్చరల్ ఆర్ట్ అకాడమీ నుంచి కళాభారతి అవార్డు, అలుమినీ జవహర్ బాలభవన్ నుంచి బాలశ్రేష్ఠ అవార్డు, న్యూదిల్లీకి చెందిన ఆదిలీల ఫౌండేషన్ నుంచి నాట్యభారతి, విశాఖలోని గాజువాకకు చెందిన కళారాధన మ్యూజిక్ అకాడమీ నుంచి నాట్య కళామణి, ఏలూరులో జరిగిన జాతీయ నృత్య పోటీల్లో ప్రథమ బహుమతిని, కోల్‌కత్తాలో ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్లో జాతీయ స్థాయిలో నాట్యమయూరి అవార్డును, శ్రీకాళహస్తిలో సిటిజన్ వెల్ఫేర్ ప్రైడ్ ఇండియా కల్చరల్ ఆధ్వర్యంలో శివనంది అవార్డును, హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాట్య తరంగిని అవార్డును అందుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల బ్రహ్మోత్సవాల్లో నాట్య ప్రదర్శన ఇచ్చింది. తన నాట్య ప్రతిభా పాటవాలతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులోనూ స్థానం పొందింది.
సంప్రదాయనాట్యమంటే మక్కువ
- ముత్తవరపు ఉజ్విత
భరతనాట్యం, కూచిపూడి అంటే చిన్ననాటి నుంచి ఎంతో ఆసక్తి. మా తల్లిదండ్రులు నాగేశ్వరరావు, దుర్గ అందించిన సహకారంతో ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు నాట్య శిక్షణ పొందాను. తాళ్లపాక అన్నమాచార్య 12వ తరం వంశీకులు డా.తాళ్లపాక సందీప్‌కుమార్ వద్ద నేర్చుకున్నా. గురువు ఆశీస్సులతో ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి బహుమతులందుకున్నా.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agniveer recruitment: ఆర్మీ అగ్నివీరుల రిక్రూట్మెంట్లో కీలక మార్పు
-
Sports News
Dipa Karmakar: జులైలో వచ్చేస్తా.. రెండేళ్లపాటు నిషేధం అనేది తప్పుడు ఆరోపణే: దీపా కర్మాకర్
-
Movies News
Vani Jairam: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు