logo

గ్రేడ్‌-2 సూపర్‌వైజర్ల జాబితా విడుదల

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ ఉద్యోగాలకు ఎంపికైన అంగన్‌వాడీ టీచర్ల జాబితాను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.

Published : 27 Nov 2022 05:15 IST

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ ఉద్యోగాలకు ఎంపికైన అంగన్‌వాడీ టీచర్ల జాబితాను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఫలితంగా ఏడాదిగా అభ్యర్థుల్లో నెలకొన్న ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం 2021, నవంబరు 3న గ్రేడ్‌-2 సూపర్‌వైజర్లు, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, సమన్వయకర్తలు, ఇన్‌స్ట్రక్టర్లు, మిడ్‌లెవల్‌ శిక్షకుల్లో అర్హులైన అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 2న రాత పరీక్ష నిర్వహించింది. ఫలితాల వెల్లడి తర్వాత న్యాయస్థానం ఆదేశాల కారణంగా తుదిజాబితా ప్రకటించలేదు. తాజాగా క్లియరెన్స్‌ రావడంతో ఎంపికైన ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. భద్రాద్రి జోన్‌లో ఉద్యోగాలు సాధించిన 79 మంది వివరాలను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా నుంచి 55మంది అంగన్‌వాడీ టీచర్లు పైకొలువులు సాధించడం విశేషం. నేడు హైదరాబాద్‌లో వారందరికీ ఉత్తర్వులు అందచేయనున్నట్లు తెలిసింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని