logo

ఆన్‌లైన్‌లో రాజ్యాంగ ఉపోద్ఘాతం’

భారత రాజ్యాంగం ఉపోద్ఘాతాన్ని ప్రజలు చదివేందుకు అనువుగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ తెలిపారు.

Updated : 27 Nov 2022 06:43 IST

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగం ఉపోద్ఘాతాన్ని ప్రజలు చదివేందుకు అనువుగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ తెలిపారు. 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఉద్యోగులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లం సహా 22 భారతీయ అధికార భాషల్లో భారత రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని ఆన్‌లైన్‌లో http://eadpreamble.nic.in వెబ్‌సైట్‌లో ఉంచారని తెలిపారు. 1949 నవంబర్‌ 26న తుది రాజ్యాంగం ఆమోదించారని, 2015 సంవత్సరం నుంచి రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటున్నామని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో మదన్‌గోపాల్‌, కలెక్టరేట్‌ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని