logo

మెరవనున్న మార్గాలు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.243.38 కోట్లు మంజూరు చేసింది. రెండు జిల్లాల్లో మొత్తం 94 రోడ్లను 394 కి.మీ. పొడవున శాశ్వత మరమ్మతులు చేసేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదించింది.

Published : 07 Dec 2022 04:40 IST

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.243.38 కోట్లు మంజూరు చేసింది. రెండు జిల్లాల్లో మొత్తం 94 రోడ్లను 394 కి.మీ. పొడవున శాశ్వత మరమ్మతులు చేసేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదించింది. పనులు చేసేందుకు పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేయగా టెండర్లు ఆహ్వానించారు. ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో 23 పనులకు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేశారు. మిగతా నియోజకవర్గాల్లో పనులకు ఈ నెల 8 తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు సమయం ఇచ్చారు.

సీఎం పిలుపుతో ప్రతిపాదనలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత నెలలో రహదారుల పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 45 రోజుల్లో రోడ్లు అద్దంలా మెరవాలని, పనులకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. దీంతో ఉభయ జిల్లాల్లోని ఆర్‌అండ్‌బీ అధికారులు పనులకు ప్రతిపాదనలు సమర్పించగా, నిధులు మంజూరు అయ్యాయి.

ఎక్కడెక్కడంటే..

వైరా-జగ్గయ్యపేట, ఖమం-ఇల్లెందు, తల్లాడ-కొత్తగూడెం, ఖమ్మం-బోనకల్‌, బూర్గంపాడు-ఏటూరునాగారం, బూర్గంపాడు-అశ్వారావుపేట, పాల్వంచ-దమ్మపేట, పల్లిపాడు-జన్నారం, ఇల్లెందు-కొత్తగూడెం, వి.వెంకటాయపాలెం నుంచి వేపకుంట్ల మీదుగా చింతగుర్తి సహా పలు ఆర్‌అండ్‌బీ రోడ్లు మరమ్మతులు చేయనున్నారు.

ఉభయ జిల్లాల్లో ఆర్‌అండ్‌బీ రహదారులకు మరమ్మతు పనులు చేపట్టేందుకు టెండర్లు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో పనులకు టెండర్లు నిర్వహించాం. గుత్తేదారులు పోటీ పడి టెండర్లు దాఖలు చేశారు. దాఖలైన టెండర్లు తెరచి పరిశీలించాల్సి ఉంది. త్వరలో రెండు జిల్లాల్లో రహదారుల మరమ్మతు పనులు ప్రారంభిస్తాం.
లక్ష్మణ్‌, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ, ఖమ్మం


 

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు