ఆపన్నులకు ఎల్లవేళలా సాయం: తానా
కష్టాల్లో ఉన్నవారికి తానా నిరంతరం సాయం అందిస్తూనే ఉంటుందని తానా అధ్యక్షుడు ఆంజనేయచౌదరి లావు, పూర్వ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, కాబోయే అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు పేర్కొన్నారు.
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌టుడే: కష్టాల్లో ఉన్నవారికి తానా నిరంతరం సాయం అందిస్తూనే ఉంటుందని తానా అధ్యక్షుడు ఆంజనేయచౌదరి లావు, పూర్వ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, కాబోయే అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు పేర్కొన్నారు. తానా చైతన్య స్రవంతి, ఆదరణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని లేక్‌వ్యూక్లబ్‌లో పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, విద్యార్థినులకు సైకిళ్లు, ల్యాప్‌ట్యాప్‌లు అందజేశారు. మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. చైతన్యస్రవంతి-2022 కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 2 నుంచి వచ్చే జనవరి 7 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
అన్నం ఫౌండేషన్‌కు రూ.7.50లక్షల విరాళం.. తానా పూర్వ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి ఖమ్మం నగరంలోని అన్నం ఫౌండేషన్‌కు రూ.7.50లక్షల విరాళాన్ని అందించారు. అన్నం ఆశ్రమంలో సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు వీటిని అందజేసినట్టు వెల్లడించారు. సంబంధిత చెక్కును అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. అన్నం శ్రీనివాసరావుకు అందజేశారు. ఏడీసీపీ సుభాష్‌చంద్రబోస్, ఎన్ఆర్ఐ జిల్లా కమిటీ అధ్యక్షురాలు స్వరూపరాణి, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, దొడ్డా రవి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dipa Karmakar: జులైలో వచ్చేస్తా.. రెండేళ్లపాటు నిషేధం అనేది తప్పుడు ఆరోపణే: దీపా కర్మాకర్
-
Movies News
Vani Jairam: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!