అంబేడ్కర్ మార్గం అనుసరణీయం: భట్టి
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధింతిని మంగళవారం నిర్వహించారు.
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న భట్టి, పువ్వాళ్ల తదితరులు
ఖమ్మం కమాన్‌బజార్, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధింతిని మంగళవారం నిర్వహించారు. డీసీసీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో సీఎల్‌పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ అంబేడ్కర్ మన దేశంలో జన్మించడం ప్రజల అదృష్టమన్నారు. భారత రాజ్యాంగం ఇతర దేశాలకు ఆదర్శమన్నారు. కార్మికులు, మహిళలు, బలహీన వర్గాలకు అనేక హక్కులు కల్పించారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ నేతృత్వంలో నాయకులు జడ్పీ సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య, గజ్జెల్లి వెంకన్న, బోజెడ్ల సత్యనారాయణ, తోటకూరి రవిశంకర్, వెనిగండ్ల సత్యనారాయణ, కార్పొరేటర్లు పల్లెబోయిన భారతి, సైదులు నాయక్, మలీదు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Spy Balloon: అమెరికాలో చైనా బెలూన్ కలకలం.. అసలేంటీ ‘స్పై బెలూన్’..?
-
Movies News
Social Look: వెడ్డింగ్ డాక్యుమెంటరీ బిజీలో హన్సిక.. క్యాప్షన్ ఆలోచించలేక రకుల్!
-
General News
TSPSC Group 4: గ్రూప్-4కు 9.5లక్షల దరఖాస్తులు.. ప్రిపరేషన్లో ఈ టిప్స్ పాటిస్తే విజేత మీరే!