గళం విప్పుతాం... నిధులు తెస్తాం
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిన హామీలు పార్లమెంట్ సమావేశాల్లో చర్చకొస్తాయని ప్రజలు భావిస్తున్న ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది.
ఈటీవీ, ఖమ్మం
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిన హామీలు పార్లమెంట్ సమావేశాల్లో చర్చకొస్తాయని ప్రజలు భావిస్తున్న ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ఉభయ సభలకు ఉమ్మడి జిల్లా నుంచి ఈసారి నలుగురు సభ్యులు హాజరుకానున్నారు. ఖమ్మం ఎంపీ, తెరాస లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతోపాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో గళం విప్పనున్నారు.
సమస్యల చిట్టా ఇదిగో..
ఉభయ జిల్లాల్లో నూతన జాతీయ రహదారుల డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వివిధ మార్గాల్లో జాతీయ రహదారులకు మోక్షం దక్కగా.. మరికొన్ని డిమాండ్లు నెరవేరలేదు. భద్రాచలం- ఏటూరునాగారం, కొత్తగూడెం- హైదరాబాద్, బూర్గంపాడు- అశ్వారావుపేట, భద్రాచలం- కాళేశ్వరం, వైరా- జగ్గయ్యపేట వరకు జాతీయ రహదారులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మార్గాల్లో కొన్నింటిపై గతంలోనే ప్రకటనలొచ్చినా అడుగు ముందుకు పడలేదు. నాగ్‌పూర్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వరంగల్- ఖమ్మం, ఖమ్మం- విజయవాడ గ్రీన్ ఫీల్డ్ కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పెంచాలన్న డిమాండ్ ఉంది. రైతులు అనేకచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. కొత్తగూడెం- సత్తుపల్లి రైల్వే లైను రాజమహేంద్రవరం వరకు కొనసాగించాలన్న డిమాండ్ ఉంది. మణుగూరు- బైలడిల్ల వరకు రైల్వే మార్గం పొడిగింపు ప్రతిపాదనలపై పురోగతి లేదు. బూర్గంపాడు మండలం సారపాక వరకు రైల్వే లైను పొడిగించాలన్న ప్రజల కోరిక నెరవేరట్లేదు. ఉమ్మడి జిల్లాకు గిరిజన, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటుపై రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లి ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి విమానాశ్రయం కేటాయించినా ముందడుగు పడట్లేదు.
కేంద్రంపై పోరాటం సాగిస్తాం:
నామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ, తెరాస లోక్‌సభా పక్ష నేత
రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో గళం వినిపిస్తున్నాం. జిల్లాకు దక్కాల్సిన అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలోనే జాతీయ రహదారుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. కొన్ని మంజూరైనా ఇంకా రావాల్సి ఉంది. మిగిలిన సమస్యలపైనా జిల్లా ప్రజల పక్షాన పార్లమెంట్లో మాట్లాడతాను. కేంద్రంపై పోరాడి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాను.
ప్రజల డిమాండ్లు వినిపిస్తా
- మాలోత్ కవిత, మహబూబాబాద్ ఎంపీ
సమావేశాల్లో ప్రజల డిమాండ్లను కేంద్రం ముందుంచుతా. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో హామీలు నెరవేర్చాలని కోరుతాను. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఇక్కడి విద్యార్థుల చిరకాల స్వప్నం. ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తుతా.
రాష్ట్రంపై వివక్ష: వద్దిరాజు రవిచంద్ర,రాజ్యసభ సభ్యుడు
రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోంది. చట్టపరంగా దక్కాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోంది. జీఎస్టీ వాటాలు ఇవ్వటం లేదు. పరిశ్రమలకు చిరునామాగా మారిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేంద్రం నుంచి ఆ స్థాయిలో ప్రోత్సాహం లేదు. వీటిపై సమావేశాల్లో గళం విప్పుతాను.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం
-
India News
IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్
-
Politics News
Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్ రెడ్డి
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు