మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరించాలి: ఐజీ
మావోయిస్టుల కదలికలపై నిఘా పటిష్ఠం చేసి నిరంతర సమాచారాన్ని సేకరించాలని మల్టి జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా పోలీసు అధికారులకు సూచించారు.
ఐజీ చంద్రశేఖర్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎస్పీ వినీత్
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: మావోయిస్టుల కదలికలపై నిఘా పటిష్ఠం చేసి నిరంతర సమాచారాన్ని సేకరించాలని మల్టి జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. తొలుత ఎస్పీ వినీత్ ఐజీకి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ విభాగం గౌరవ వందనాన్ని సమర్పించింది. ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులతో కార్యాలయ సమావేశ మందిరంలో ఐజీ సమీక్ష నిర్వహించారు. శాంతి, భద్రతల పరిరక్షణ, మావోయిస్టులపై నిఘా, ఇతర సమస్యలపై సూచనలు చేశారు. అధికారుల పనితీరుపై ఆరా తీశారు. శాంతి, భద్రతల పరిరక్షణలో బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఆ తర్వాత నవభారత్ ఏరియాలో నిర్మిస్తున్న నూతన జిల్లా పోలీసు కార్యాలయ పనులను పరిశీలించారు. ఐజీ వెంట అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) టి.సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్, డీఎస్పీలు జి.వెంకటేశ్వరబాబు, రమణమూర్తి, రాఘవేంద్రరావు, సత్యనారాయణ, డీసీఆర్‌బీ డీఎస్పీ నందీరామ్, ఏఆర్ డీఎస్పీ విజయ్‌బాబు, సీఐలు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి.. ఆనంద్ మహీంద్రా మోటివేషనల్ పోస్ట్
-
Movies News
Sembi Review: రివ్యూ: సెంబి
-
Movies News
Social Look: రెండు జళ్ల ప్రణీత.. దుబాయ్‌లో నేహాశర్మ.. అను ‘బ్లూ’ డ్రెస్సు!
-
India News
Parliament: ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు.. వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా
-
India News
నిరుద్యోగ సమస్యకు కారణమదే.. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దు: మోహన్ భాగవత్
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. గెలిచేది ఆ జట్టే: మహేల జయవర్దనే