logo

19 కేంద్రాలు.. 6,664 మంది అభ్యర్థులు

వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో రాతపరీక్ష ఆదివారం జరగనుంది.

Published : 21 Jan 2023 01:05 IST

టీఎస్‌పీఎస్‌సీ ఏఈఈ పోస్టులకు రాత పరీక్ష రేపు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో రాతపరీక్ష ఆదివారం జరగనుంది. కలెక్టర్‌ గౌతమ్‌ నేతృత్వంలో ఖమ్మంలో 19 కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలకు ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ను చీఫ్‌ సూపరింటెండెంట్లుగా నియమించారు.

ఉభయ జిల్లాల నుంచి..

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి 6,664 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో రెండు పేపర్లు ఉంటుంది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయత్రం 5 గంటల వరకు రెండో పేపర్‌ పరీక్ష జరగనుంది.

నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 నుంచి 9.45 గంటల వరకు అనుమతిస్తారు. 9.45 గంటల తర్వాత ఒక్క నిమిషం దాటినా అనుమతించరు. రెండో పేపర్‌ పరీక్షకు మధ్యాహ్నం 1.30 నుంచి 2.15 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ప్రశ్నపత్రంలో ప్రశ్నలకు జవాబులను గుర్తించి ఓఎంఆర్‌ షీట్‌లో బాల్‌పాయింట్‌ పెన్నుతో పూరించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, మొబైల్‌ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటివి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. టీఎస్‌పీఎస్‌సీ అధికారులు నలుగురు ఖమ్మంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.


అలాంటివారు ధ్రువపత్రం తేవాలి మధుసూదన్‌, అదనపు కలెక్టర్‌, ఖమ్మం

ఏఈఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. హాల్‌టికెట్‌పై ఫొటో లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలపై గెజిటెడ్‌ అధికారి సంతకం, అండర్‌ టేకింగ్‌ ధ్రువపత్రం తీసుకొస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఖమ్మంలోని 19 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలుగా వసతులు సమకూర్చాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని