logo

పంచాయితీలకు నూతన శోభ

నూతన పంచాయతీలు ఏర్పాటైన నాలుగేళ్ల తర్వాత కార్యాలయ భవన నిర్మాణాలకు మోక్షం కలిగింది.

Published : 23 Jan 2023 03:27 IST

జిల్లాలో రూ.33.40 కోట్లు మంజూరు

వేదాంతపురంలో ఆరుబయటే గ్రామ పంచాయతీ పాలక వర్గ సమావేశం (పాత చిత్రం)

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: నూతన పంచాయతీలు ఏర్పాటైన నాలుగేళ్ల తర్వాత కార్యాలయ భవన నిర్మాణాలకు మోక్షం కలిగింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2022-23 నిధులతో ఏజెన్సీ ప్రాంతంలోని 167 పంచాయతీల కార్యాలయ భవనాలకు రూ.33.40 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఇప్పటికే పాలనాపరమైన అనుమతులిచ్చారు. ఒక్కో భవనాన్ని రూ.20 లక్షలతో నిర్మిస్తున్నారు. ఈ పనులను పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ పర్యవేక్షణలో జరుగనున్నాయి.

భద్రాద్రి జిల్లాలో మొత్తం 479 గ్రామ పంచాయతీలున్నాయి. పాతవి 205 కాగా.. నూతనంగా 274 పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిలో 195 పంచాయతీలకే సొంత భవనాలున్నాయి. మిగతా 284 అద్దె, వసతుల్లేని తాత్కాలిక కార్యాలయాల్లో పాలన సాగిస్తున్నాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 162, ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలో ఐదు పంచాయతీలకు సంబంధించి నూతన భవనాల నిర్మాణాలకు అనుమతులు వచ్చినట్లు జిల్లా పంచాయతీరాజ్‌ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని