logo

ఐదేళ్లలో 100 మి.ట. బొగ్గు ఉత్పత్తే లక్ష్యం

ఐదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్లు డైరెక్టర్‌(పా) ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందుకోసం మరో పది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.

Published : 27 Jan 2023 02:47 IST

గౌరవ వందనం స్వీకరిస్తున్న చంద్రశేఖర్‌

కొత్తగూడెం సింగరేణి: ఐదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్లు డైరెక్టర్‌(పా) ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందుకోసం మరో పది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాకు నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉత్పత్తిలో 29, రవాణాలో 37, టర్నోవర్‌లో 123, లాభాల్లో 193 శాతం వృద్ధి సాధించామన్నారు. సత్తుపల్లి గనుల నుంచి బొగ్గు రవాణాకు రైల్వే శాఖతో కలిసి రూ.1,000 కోట్లతో 54 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. రిజర్వేషన్లను సింగరేణి పూర్తిస్థాయిలో అమలుచేస్తోందన్నారు. ఇప్పటికే 1,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. మరో 800 యూనిట్ల ప్లాంటు ఏర్పాటుకు ముఖ్యమంత్రి అనుమతించారని తెలిపారు. డైరెక్టర్లు ఎన్‌.బలరాం, సత్యనారాయణరావు, జీఎంలు కె.బసవయ్య, సీహెచ్‌ నర్సింహారావు, ఆనందరావు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ సలహాదారు దమ్మాలపాటి శేషయ్య, సీఎంవోఏఐ నాయకుడు మధుకర్‌ పాల్గొన్నారు. రుద్రంపూర్‌ జయశంకర్‌ మైదానంలో నిర్వహించిన కొత్తగూడెం ఏరియా స్థాయి వేడుకల్లో జీఎం జక్కం రమేష్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. 8 మంది ఉత్తమ ఉద్యోగులను కుటుంబ సభ్యులతో సహా సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని