logo

నేటి నుంచి ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ

జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుంది. ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాపై విద్యాశాఖ కసరత్తు చేసింది.

Published : 27 Jan 2023 02:47 IST

ఉపాధ్యాయుల జాబితా వివరాలు పరిశీలిస్తున్న జేడీ వెంకటనర్సమ్మ, డీఈవో శర్మ, అధికారులు

కొత్తగూడెం విద్యావిభాగం: జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుంది. ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాపై విద్యాశాఖ కసరత్తు చేసింది. తుది జాబితా ప్రకారం జడ్పీ ఉన్నత పాఠశాల(లోకల్‌బాడీ)ల్లో 2005 డిసెంబరు 31 లోపు నియమితులైన స్కూల్‌ అసిస్టెంట్లు(ఎస్‌ఏ), ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌.ఎం.లు 195 మందికి ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి దక్కనుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2006 డిసెంబరు 31లోపు నియమితులైన 26 మంది ఎస్‌ఏలూ హెచ్‌.ఎం.లు కానున్నారు. పాతపాల్వంచలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల్ల(ఎస్జీటీ) ఎస్‌ఏ ఉద్యోగోన్నతుల ప్రక్రియ సాగనుంది. అర్హులైన వారి వివరాలను ఒక హెచ్‌.ఎం., మరో టెక్నికల్‌ అసిస్టెంట్‌తో కూడిన సుమారు 10 బృందాలు సిద్ధం చేయనున్నాయి. ఈ ప్రక్రియను డీఈవో సోమశేఖర్‌శర్మ, ఏఎస్‌వో సతీశ్‌కుమార్‌, ఏపీవో కిరణ్‌కుమార్‌, టెక్నికల్‌ అధికారులు మోహన్‌ తదితరులు పర్యవేక్షిస్తారు. ఈ జాబితాలో చోటు దక్కేవారు ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వెంటనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో వివిధ కేటగిరీలలో 1,538 ఖాళీలున్నట్లు గుర్తించిన అధికారులు.. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు 37 రోజుల షెడ్యూల్‌ను రూపొందించారు.  

కొత్తగూడెం విద్యావిభాగం: ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు, బదిలీల సీనియార్టీ జాబితా తయారీ పకడ్బందీగా జరుగుతుందని జిల్లా పరిశీలకులు, జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటనర్సమ్మ అన్నారు. డీఈవో కార్యాలయంలో కొనసాగుతున్న ప్రక్రియను గురువారం పరిశీలించారు. డీఈవో సోమశేఖర్‌శర్మ, ఏఎస్‌వో సతీశ్‌కుమార్‌, ప్రభుత్వ పరీక్షల సహాయాధికారి మాధవరావు, ఏపీవో కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని