logo

పరమ పావనం.. సీతారామ కల్యాణం

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు. క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేసిన తీరు మంత్రముగ్ధులను చేసింది.

Published : 27 Jan 2023 02:47 IST

కచేరీ చేస్తున్న ప్రముఖ కళాకారుడు మల్లాది సూరిబాబు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు. క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేసిన తీరు మంత్రముగ్ధులను చేసింది. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ యూనివర్సిటీ డీన్‌ ఘంటా రమేశ్‌ రాములవారిని దర్శించుకున్నారు. ఈయన వెంట భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాల సిబ్బంది ఉన్నారు. బీ దేవాదాయ శాఖ చీఫ్‌ ఇంజినీరు సీతారాములు గురువారం భద్రాచలం రాములవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు సాదరంగా స్వాగతం పలికారు. ఈయన వెంట రామాలయం ఈఈ రవీంద్రనాధ్‌ ఉన్నారు. బీ భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో భక్తరామదాసు జయంత్యుత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సంబురాలలో భాగంగా రెండో రోజైన గురువారం సంగీత కచేరీ ఆకట్టుకుంది. తబల, ఘటం, మృదంగం, వయోలిన్‌ వంటి వాయిద్య పరికరాలతో భక్తి కీర్తనలకు ప్రాణం పోశారు. భద్రాచలం దేవాలయ ఆస్థాన విద్వాంసులు మృదుమధురమైన నాదస్వరం వినిపించారు. వేర్వేరు చోట్ల స్థిరపడిన కళాకారులు తరలివచ్చి రామార్చన చేసి మెప్పించారు. మల్లాది సూరిబాబు కుటుంబానికి చెందిన ఉద్దండులైన కళాకారులు ఆలపించిన ప్రతీ పాట పరమాద్భుతంగా వినిపించడంతో చిత్రకూట మండపంలో చప్పట్ల మోత మోగింది. 29 వరకు ఈ వాగ్గేయకారోత్సవాలు ఉంటాయని ఈవో శివాజీ తెలిపారు.

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: నేలకొండపల్లిలోని భక్తరామదాసు ధ్యాన మందిరంలో శ్రీవెంకటాద్రి భక్తసమాజం ప్రత్యేక కీర్తనలు ఆలపించింది. చెన్నై నుంచి సుమారు 50 మందికిపైగా కళాకారులు, వాయిద్యకారులు ఇక్కడకు వచ్చారు. ఆలయ పూజారి సౌమిత్రి రమేష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

కీర్తనలు ఆలపిస్తున్న వెంకటాద్రి భక్త సమాజ బృందం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని