logo

గుండె గండం గట్టెక్కేదెలా?

ఆడుతూ.. పాడుతూ సరదాగా చదువులు సాగే వయస్సు తనది. ఆ ప్రాయంలో తన కూతురి గుండె లయ తప్పుతోందని గుర్తించి తల్లడిల్లుతోంది.

Updated : 29 Jan 2023 07:14 IST

దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న దారావత్‌ సిరి

ఆడుతూ.. పాడుతూ సరదాగా చదువులు సాగే వయస్సు తనది. ఆ ప్రాయంలో తన కూతురి గుండె లయ తప్పుతోందని గుర్తించి తల్లడిల్లుతోంది. శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని తెలిసిన తల్లి వైద్య ఖర్చులు పెట్టే స్థోమత లేక కూతురిని ఎలా దక్కించుకోవాలో తెలియక రోదిస్తోంది. దాతల సాయం కోసం అర్థిస్తోంది. వివరాలిలా ఉన్నాయి..

తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన దారావత్‌ త్రివేణికి ఇద్దరు కుమార్తెలు. పిల్లలు పుట్టిన తర్వాత భర్త వదిలి వెళ్లిపోయాడు. పెద్ద కుమార్తె సిరి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. చిన్న కూతురు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. త్రివేణి ప్రస్తుతం బాలపేట సెకండ్‌ ఏఎన్‌ఎంగా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తోంది. చాలీచాలని జీతంతో తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. పెద్ద కూతురు సిరి చిన్నప్పటి నుంచే గుండె జబ్బుతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర నొప్పి రావడంతో వైద్యులకు చూపించారు. పరీక్షించిన వైద్యులు సిరి గుండెకు రంధ్రం ఉందని, ఈనెలాఖరు నాటికి శస్త్రచికిత్స చేయించాలని సూచించారు. ఇందుకు రూ.6లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. నిరుపేద కుటుంబ కావడంతో సిరి వైద్యానికి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. దాతలు స్పందించి సాయం అందించి తన కుమార్తెను ఆదుకోవాలని తల్లి త్రివేణి కోరుతుంది.

తల్లాడ, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని