logo

తప్పులు లేకుండా తగిన జాగ్రత్తలు ముఖ్యం

చాలాకాలం తర్వాత ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీలు జరుగుతున్నాయి.

Published : 29 Jan 2023 03:05 IST

ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ సూచనలు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: చాలాకాలం తర్వాత ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు హడావుడిలో గందరగోళానికి గురై సరైన సమాచారం దరఖాస్తులో పొందుపరచకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకుని దరఖాస్తులను నింపాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ వివరించారు.

ఇవీ ముఖ్యాంశాలు...  * బదిలీల దరఖాస్తులు పాఠశాల ‘ఈడీయూ.తెలంగాణ.ఇన్‌’ వెబ్‌ సైట్‌లో ఎనేబుల్‌ చేశారు. * మెడికల్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకునే వారికి జిల్లాలో మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. వారు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు మాత్రమే అప్‌లోడ్‌ చేయాలి * స్పౌజ్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి  * మొదటగా స్పౌజ్‌ పని చేసే మండలం తర్వాత దగ్గర్లోని మండలాల ఆప్షన్స్‌ మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో సంబంధిత ఉపాధ్యాయుడికి మిగిలిపోయే ఆప్షన్స్‌ రావచ్చు. * ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపిన తర్వాత సబ్‌మిట్‌ చేసే ముందు ఒకసారి అన్ని వివరాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి * ఒకసారి చేసిన తర్వాత ఎడిట్‌ చేసేందుకు అవకాశం ఉండదు * ఒక ఉపాధ్యాయుడు బదిలీ దరఖాస్తుకు అతని చరవాణి నెంబరు, ఎంప్లాయి ఐడీ, ఆధార్‌ నెంబరుతో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది

ఇతర సమాచారం... కాంప్లెక్స్‌ పరిధిలోని ఎస్‌జీటీలు తమ బదిలీ దరఖాస్తులను సంబంధిత కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడికి సమర్పించాలి. వాటిని కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు ఎంఈవోకు ఇవ్వాలి బీ మిగతా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(నాన్‌ కాంప్లెక్స్‌) తమ బదిలీ దరఖాస్తులు, స్కూల్‌ అసిస్టెంట్‌ దరఖాస్తులను సంబంధిత ఎంఈవోకు ఇవ్వాలి బీ వీటికి సంబంధించిన రికార్డు నిర్వహించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని