logo

స్టేడియాన్ని పరిశీలించిన ఆర్టీఏ కమిషనర్‌

ఆర్టీఐ కమిషనర్‌ శంకర్‌నాయక్ ఆదివారం ఖమ్మం సర్దార్‌పటేల్‌ స్టేడియాన్ని పరిశీలించారు. ఇక్కడి క్రీడా ప్రాంగణాలను తిరిగి చూశారు.

Updated : 29 Jan 2023 18:46 IST

ఖమ్మం క్రీడలు: ఆర్టీఏ కమిషనర్‌ శంకర్‌నాయక్ ఆదివారం ఖమ్మం సర్దార్‌పటేల్‌ స్టేడియాన్ని పరిశీలించారు. ఇక్కడి క్రీడా ప్రాంగణాలను తిరిగి చూశారు. సమాచార హక్కు చట్టం శాఖలో అమలువుతున్న పని తీరును కూడా ఈ సందర్భంగా పరిశీలించారు. డీవైఎస్‌వో పరంధామరెడ్డి, క్రీడా శిక్షకులు ఆయన వెంట ఉన్నారు. 


జాతీయ స్థాయి  కరాటే పోటీలు ప్రారంభం

ఖమ్మం క్రీడలు : జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఒకరోజు పరిమితంగా జరుగుతున్న ఈ పోటీలను ఖమ్మం సైదులు కరాటే స్కూల్‌ సంస్థ నిర్వహిస్తోంది.  అంతకుముందు ఈ పోటీలను ఆబ్కారీ సీఐ సర్వేష్‌ ప్రారంభించారు. 


జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలు 
ఖమ్మం క్రీడలు : నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో 15 నుంచి 29 ఏళ్ల వయసున్న యువతకు  వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో  జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల నుంచి యువత పాల్గొన్నారు.మొత్తం 110 మంది పాల్గొనగా.. ఇందులో 22 మందిని విజేతలుగా నిర్ణయించారు. ఈ విజేతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఎన్‌వైకే కోఆర్డీనేటర్‌ అన్వేష్‌ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని