logo

గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి: కలెక్టర్‌

అధిక ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ ఆదేశించారు.

Published : 01 Feb 2023 03:55 IST

శాంతినగర్‌ పాఠశాలలో పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ స్నేహలత తదితరులు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: అధిక ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ ఆదేశించారు. ఐడీవోసీ భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మేజర్‌ గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సమీక్షించారు. పది వేలకు పైగా జనాభా ఉండి మున్సిపాలిటీలు కాని పంచాయతీలైన పెద్దతండా, ఏదులాపురం, నేలకొండపల్లి, కల్లూరు, కొమ్మినేపల్లి, పాలేరు, తల్లాడ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. పార్కులు, ప్రజా మరుగుదొడ్లు, ట్యాంక్‌ బండ్‌, గ్రంథాలయ భవనాలు, దుకాణ సముదాయాలు, ఇండోర్‌ స్టేడియం, భక్తరామదాసు ధ్యాన మందిరం అభివృద్ధి పనులు వంటివి చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ స్నేహలత, ఇన్‌ఛార్జి డీపీవో అప్పారావు, డీఎల్పీవో పుల్లారావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

పాఠశాలల పరిశీలన

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ‘మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి, పునః ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పాఠశాలలను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సందర్శించారు. స్థానిక శాంతినగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన పెయింటింగ్‌, వంట గదులు, తరగతి గదులు, భోజనశాలలు, శౌచాలయాలను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ స్నేహలత, మున్సిపల్‌ ఈఈ కృష్ణలాల్‌, డీఈ స్వరూపరాణి, శాంతినగర్‌, మామిళ్లగూడెం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి, శాంత, ఎంఈవో శ్రీనివాస్‌, సెక్టార్‌ ఆఫీసర్‌ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని