logo

పోడు పట్టాల దరఖాస్తులకు డివిజన్‌ కమిటీ సిఫార్సు

జిల్లాలో పోడు భూములకు పట్టాలు జారీ చేసేందుకు 3,933 దరఖాస్తులకు సంబంధించి 4,925.63 ఎకరాల భూమికి రెవెన్యూ డివిజన్‌ స్థాయి కమిటీలు సిఫార్సు చేయగా జిల్లాస్థాయి కమిటీలో చర్చించినట్లు కలెక్టర్‌ గౌతమ్‌, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు తెలిపారు.

Published : 01 Feb 2023 03:55 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌, ఐటీడీఏ పీవో గౌతమ్‌ తదితరులు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: జిల్లాలో పోడు భూములకు పట్టాలు జారీ చేసేందుకు 3,933 దరఖాస్తులకు సంబంధించి 4,925.63 ఎకరాల భూమికి రెవెన్యూ డివిజన్‌ స్థాయి కమిటీలు సిఫార్సు చేయగా జిల్లాస్థాయి కమిటీలో చర్చించినట్లు కలెక్టర్‌ గౌతమ్‌, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు తెలిపారు. ఖమ్మంలోని ఐడీవోసీ భవనంలోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో పోడు భూములకు పట్టాల జారీ అంశం సమీక్షించారు. కలెక్టర్‌ గౌతమ్‌ మాట్లాడుతూ... జిల్లాలోని 10 మండలాల్లో 94 గ్రామ పంచాయతీల పరిధిలో 132 ఆవాస ప్రాంతాల నుంచి గిరిజనులకు సంబంధించి 9,507(25,515 ఎకరాలు), గిరిజనేతరుల నుంచి 8980(17,678 ఎకరాలకు) దరఖాస్తులు అందినట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో విచారణ, సర్వే అనంతరం గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయగా, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో కమిటీ పరిశీలించిన సిఫార్సుల మేరకు జిల్లా కమిటీలో చర్చించినట్లు తెలిపారు. అభ్యంతరాలుంటే పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామన్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు మాట్లాడుతూ... కల్లూరు రెవెన్యూ డివిజన్‌ స్థాయి కమిటీ 22 ఆవాసాల్లో 684 దరఖాస్తులకు సంబంధించి 693.48 ఎకరాలు, ఖమ్మం 83 ఆవాసాల నుంచి 3249 దరఖాస్తులకు సంబంధించి 4232.15 ఎకరాలకు హక్కు పత్రాలకు సిఫార్సు చేయగా జిల్లాస్థాయి కమిటీలో చర్చించినట్లు వివరించారు. అర్హులందరికీ అటవీ హక్కు పత్రాలు జారీ చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ స్నేహలత, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్‌ విక్రమ్‌ సింగ్‌, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, సూర్యనారాయణ, గిరిజన అభివృద్ధి అధికారి కృష్ణనాయక్‌, జడ్పీటీసీ సభ్యులు ప్రియాంక, జగన్‌, బుజ్జి, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం: 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కల్పించేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు అన్నారు. ఇందుకు సంబంధించి ప్రచార గోడ పత్రికను ఖమ్మం ఐడీవోసీ భవనంలో మంగళవారం వారు ఆవిష్కరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గురుకుల డిగ్రీ కళాశాలలు మణుగూరు (పురుషులు), కొత్తగూడెం(మహిళలు), దమ్మపేట పెద్దవాగు ప్రాజెక్టు(మహిళలు), ఖమ్మం(మహిళలు) కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి కలిగిన 2023 మేలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తండ్రి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతానికి చెందిన వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని, ఇంటర్‌లో 40 శాతం మార్కులు ఉండాలని సూచించారు. అర్హులైన అభ్యరులు ‌్ర్ర్ర.్మ్ణ్మ‌్ర్ణ్య౯్యఁ్యః్చ్ఝ.్మ’ః్చ-్ణ్చ-్చ.్ణ్న‌్ర.i- వెబ్‌ సైట్‌లో సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 5 తుది గడువని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని