logo

ఈసారైౖనా రైౖలుకూత వినిపించేనా...?

కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై ఉభయ జిల్లాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఏటా బడ్జెట్‌కు ముందు జిల్లా వాసుల ఆకాంక్షలతో కేంద్రం ముందుకు చాంతాడంత ప్రతిపాదనలు వెళుతున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు.

Updated : 01 Feb 2023 06:02 IST

ఈటీవీ, ఖమ్మం

కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై ఉభయ జిల్లాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఏటా బడ్జెట్‌కు ముందు జిల్లా వాసుల ఆకాంక్షలతో కేంద్రం ముందుకు చాంతాడంత ప్రతిపాదనలు వెళుతున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఈసారైనా ఆశల రైలు ఆగుతుందా లేదా అన్నది ఇవాళ్టి రైల్వే బడ్జెట్‌తో తేలిపోనుంది.


కదలిక వచ్చేనా..

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఏళ్ల తరబడి రైల్వే ప్రాజెక్టులకు మోక్షం దక్కడం లేదు. నిధుల కేటాయింపు, ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈసారైనా రైల్వే బడ్జెట్‌లో ఉభయ జిల్లాలకు న్యాయం జరుగుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాలు, బొగ్గు గనులు, గ్రానైట్‌ పరిశ్రమలకు నిలయంగా మారిన ఈ జిల్లాల్లో అందుకు అనుగుణంగా రైల్వే మార్గాల అనుసంధానం జరిగితే మరింత సౌలభ్యంగా ఉంటుంది.


ప్రతిపాదనలు ఇవే

* ఖమ్మం రైల్వేస్టేషన్‌లో అప్పర్‌ క్లాస్‌ వెయిటింగ్‌ ఏసీ హాల్‌ ఏర్పాటుచేయాలి. వెస్ట్‌ బుకింగ్‌ వైపు లిఫ్టు, మహిళలకు వెయిటింగ్‌ గది నిర్మించాలి. ఫ్లాట్‌ఫాంలపై షెడ్లు పెంచాలి. రైల్వే పరిసర ప్రాంతాల్లో 60 సీసీటీవీలు సమకూర్చాలి. సారథినగర్‌ అండర్‌ బ్రిడ్జి పనులు పూర్తిచేయాలి.

* ఖమ్మంరైల్వేస్టేషన్‌ ఆవరణలో డయాగ్నొస్టిక్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి.

* కేరళ ఎక్స్‌ప్రెస్‌ ఖమ్మంలో ఉదయం 6.20 గంటలకు ఆగాలి.

* మధిర రైల్వేస్టేషన్‌లో కోచ్‌ ఇండికేషన్‌ బోర్డులు, రెండు లిఫ్టులు ఏర్పాటుచేయాలి.

* ఎర్రుపాలెంలో కొత్త స్టేషన్‌ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలి. కొవిడ్‌కు ముందు ఆగే రైళ్లను     పునరుద్ధరించాలి.

* కొత్తగూడెం- సత్తుపల్లి రైల్వే లైనును రాజమహేంద్రవరం వరకు విస్తరించాలి.

* ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం వెళ్లే ప్రయాణికుల కోసం బూర్గంపాడు మండలం పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్‌ను పొడిగించాలి.

* డోర్నకల్‌ నుంచి మణుగూరు వరకు డబ్లింగ్‌ లైను ఏర్పాటు చేయాలి.

* మణుగూరు- బైలడిల్లా వరకు రైల్వే మార్గాన్ని పొడిగించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని