logo

ముస్కాన్‌ బృందం పరిశీలన

జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ముస్కాన్‌ బృందం పిల్లల వార్డులను పరిశీలించింది. వైద్య సేవల నాణ్యతను పరిశీలించేందుకు యూనిసెఫ్‌ కన్సల్టెంట్‌ రవినాయుడు, స్టేట్‌ కన్సల్టెంట్‌ బద్రీ బుధవారం సాయంత్రం జిల్లా ఆస్పత్రిని సందర్శించారు

Published : 02 Feb 2023 04:24 IST

పిల్లల వార్డులో చిన్నారి తల్లితో మాట్లాడుతున్న ముస్కాన్‌ బృందం

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ముస్కాన్‌ బృందం పిల్లల వార్డులను పరిశీలించింది. వైద్య సేవల నాణ్యతను పరిశీలించేందుకు యూనిసెఫ్‌ కన్సల్టెంట్‌ రవినాయుడు, స్టేట్‌ కన్సల్టెంట్‌ బద్రీ బుధవారం సాయంత్రం జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని పిల్లల ఓపీ, పాల బ్యాంకు, ఎస్‌ఎన్‌సీయూ, పీఐసీయూ, ఎన్‌ఆర్‌సీ విభాగాల్లో సేవలను తనిఖీ చేశారు. ముస్కాన్‌ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. వార్డుల్లో తల్లీ పిల్లలకు తగిన స్థాయిలో మంచాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్లినికల్‌ ప్రొటోకాల్స్‌, స్నేహపూర్వక సేవలు, రిఫరల్‌ కేసులపై పర్యవేక్షణ, సంరక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఆయా అంశాలను పరిగణిస్తూ ముస్కాన్‌ గుర్తింపు పత్రం అందజేస్తుందని తెలిపారు. ఇది వస్తే ప్రభుత్వ ప్రోత్సాహకాలకు అర్హత లభిస్తుందని తెలిపారు. ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృపా ఉషశ్రీ, ఆర్‌ఎంవో డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, డాక్టర్‌ అమర్‌ సింగ్‌, క్వాలిటీ మేనేజర్‌ ఉపేందర్‌, హెడ్‌ నర్సు పుష్ప, ఇందిర, స్టాఫ్‌ నర్సులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని