logo

ఇసుక అక్రమాలపై నోటీసులు

దుమ్ముగూడెం మండలం రామారావుపేట ఇసుక రీచ్‌లో అక్రమాలపై గిరిజన సొసైటీకి శుక్రవారం గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు.

Published : 04 Feb 2023 04:37 IST

నోటీసు అందజేస్తున్న సర్పంచి సోయం పార్వతి, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: దుమ్ముగూడెం మండలం రామారావుపేట ఇసుక రీచ్‌లో అక్రమాలపై గిరిజన సొసైటీకి శుక్రవారం గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. రేగుబల్లి వద్ద గోదావరి నది ఒడ్డున ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లో అక్రమంగా ఇసుక తవ్వకాలు, తరలింపులపై శుక్రవారం ‘ఈనాడు’లో ‘తవ్వేకొద్దీ అక్రమాలు’ శీర్షికన కథనం ప్రచురితమవడంతో స్పందించిన సర్పంచి సోయం పార్వతి, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ శుక్రవారం గిరిజన సొసైటీ ఛైర్‌పర్సన్‌ స్వరూపారాణికి నోటీసులు అందజేశారు. నోటీసులోని ఆరు ప్రశ్నలకు పది రోజుల్లో పూర్తి సమాచారం పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని