logo

ఆధునిక విద్యావిధానం అవసరం

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్య నందించాల్సిన అవసరం ఉందని సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు.

Published : 05 Feb 2023 02:10 IST

హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ వార్షికోత్సవంలో సీపీ విష్ణు వారియర్‌


జ్యోతి వెలిగిస్తున్న సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌, పక్కన రవిమారుత్‌, పార్వతిరెడ్డి తదితరులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్య నందించాల్సిన అవసరం ఉందని సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ 21వ వార్షికోత్సవాలను శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సలహాలతోనే తాను మొదటి ప్రయత్నంలో ఐపీఎస్‌ సాధించినట్లు చెప్పారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ ముందుండేలా యాజమాన్యం ప్రోత్సహించడంపై హర్షం వ్యక్తం చేశారు. హార్వెస్ట్‌ విద్యా సంస్థల కరస్పాండెంట్‌ పి.రవిమారుత్‌ మాట్లాడుతూ... ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు సమాయత్తం కావాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్‌ ఆర్‌.పార్వతిరెడ్డి మాట్లాడుతూ.. తమ విద్యా సంస్థల్లో చదువుతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన కల్పించటంలో ముందుంటామని చెప్పారు. క్వెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌ డాక్టర్‌ వై.నాగమణి మాట్లాడుతూ.. విద్యకు, నైపుణ్యాలకు, ఉపాధికి, దేశాభివృద్ధికి మధ్య ఉన్న సంబంధాలను ప్రభుత్వాలు గ్రహించాలని, ఇందుకోసం చిన్నప్పటి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సినీ దర్శకుడు అక్కినేని కుటుంబరావు, కార్పొరేటర్‌ బిక్కసాని ప్రశాంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సీపీ విష్ణు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని