logo

దరఖాస్తుల విచారణ ప్రక్రియ వేగవంతం: కలెక్టర్‌

జీవో నంబర్‌ 58, 59 కింద ప్రజల నుంచి అందిన దరఖాస్తులు విచారించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.

Published : 05 Feb 2023 02:10 IST

ఖమ్మం నగరం: జీవో నంబర్‌ 58, 59 కింద ప్రజల నుంచి అందిన దరఖాస్తులు విచారించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఐడీఓసీ భవనంలో తహసీల్దార్లు, ఆర్‌ఐలతో కలెక్టర్‌ సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా అతి తక్కువ ధర నిర్ణయించి, రుసుం చెల్లించిన వారికి పట్టాలు అందిస్తారనే విషయాన్ని దరఖాస్తుదారులకు వివరించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, శిక్షణ కలెక్టర్‌ రాధిక గుప్త, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, సూర్యనారాయణ  పాల్గొన్నారు.

ఖమ్మం నగరం: ఖమ్మంలోని ఐడీవోసీ భవనంలో కలెక్టర్‌తో జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు భేటీ అయ్యారు. మధిర నియోజకవర్గంలో నెలకొన్న పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అర్హులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని కోరారు. కలెక్టర్‌ సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఖమ్మం నగరం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ   ఛైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దోరేపల్లి శ్వేత కలెక్టర్‌ గౌతమ్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని