logo

విశ్వనాథ్‌ జీవితం.. సినీ గ్రంథాలయం

తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ జీవితం ఔత్సాహికులకు సినీ గ్రంథాలయం వంటిదని సీనియర్‌ కళాకారిణి, న్యాయవాది వనం కృష్ణవేణి పేర్కొన్నారు.

Published : 06 Feb 2023 05:48 IST

సంస్మరణ సభలో వక్తలు

కళాతపస్వికి విశ్వనాథ్‌కు నివాళులర్పిస్తున్న అతిథులు

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ జీవితం ఔత్సాహికులకు సినీ గ్రంథాలయం వంటిదని సీనియర్‌ కళాకారిణి, న్యాయవాది వనం కృష్ణవేణి పేర్కొన్నారు. నగరంలోని ఐఎంఏ హాలులో విశ్వనాథ్‌ సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం నిర్వహించారు. తొలుత అతిథులు జ్యోతిని వెలిగించి, విశ్వనాథ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. విశ్వనాథ్‌ క్రమ శిక్షణకు మారు పేరని, ప్రతి సినిమాను ఒక తపస్సులా తీర్చిదిద్దారని కొనియాడారు. నూతన నటీ నటులను ప్రోత్సాహించడంలో ఆయన్ని మించిన దర్శకులు లేరని, తన సినిమాల్లో సామాజిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఖమ్మం నగరానికి విశ్వనాథ్‌ను మూడుసార్లు తీసుకొచ్చే అవకాశం దక్కడం మరువలేనిదన్నారు. ఖమ్మం కళా పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నాగబత్తిని రవి మాట్లాడుతూ.. ప్రతి సినిమాను యజ్ఞంలా తీయడం విశ్వనాథ్‌ గొప్పదనం అని, ఆయన మరణం తెలుగు చిత్రసీమకు లోటని పేర్కొన్నారు. గాయకుడు మోదుగు గోవిందు ఆలపించిన విశ్వనాథ్‌ సినిమాల్లోని గీతాలు ఆకట్టుకున్నాయి. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గౌరవాధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, కొత్తమాసు హేమసుందర్‌రావు, రవీందర్‌, కడవెండి వేణుగోపాల్‌, మాధవరావు, ఎస్వీ రమణ, బీవీ రెడ్డి, వనం తేజస్వినీ, రాయప్రోలు సుబ్రహ్మణ్యం, కేవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు