logo

చికిత్స పొందుతూ మహిళ మృతి

ఆర్థిక, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై నాలుగు రోజుల క్రితం కామేపల్లి మండలం మద్దులపల్లిలో దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో భర్త మృతి చెందిన విషయం విదితమే.

Published : 06 Feb 2023 05:48 IST

కొమ్మినబోయిన పద్మ

కామేపల్లి, న్యూస్‌టుడే: ఆర్థిక, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై నాలుగు రోజుల క్రితం కామేపల్లి మండలం మద్దులపల్లిలో దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో భర్త మృతి చెందిన విషయం విదితమే. భార్య కొమ్మినబోయిన పద్మ(50) ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. జడ్పీటీసీ సభ్యుడు వెంకటప్రవీణ్‌కుమార్‌ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, గోపిరెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.


ఛత్తీస్‌గఢ్‌లో భాజపా మండల అధ్యక్షుడి దారుణ హత్య

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా ఆవుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ భాజపా సీనియర్‌ నాయకుడ్ని ఆదివారం మధ్యాహ్నం మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఊసూరు భాజపా మండల శాఖ అధ్యక్షుడు నీకంఠ కక్కెం(60) ఆదివారం మధ్యాహ్నం సమయంలో స్వగ్రామమైన పెకారాంలో తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల వివాహ కార్యక్రమానికి వెళ్లారు. పథకం ప్రకారం కొంతమంది మావోయిస్టులు ఒక్కసారిగా అతనిపై మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. బంధువులు, కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురై చెల్లాచెదురయ్యారు. ఘటనా స్థలంలోని అతని మృతదేహం వద్ద మావోయిస్టులు హెచ్చరికలు చేస్తూ కరపత్రాలను వదిలివెళ్లారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తూ మావోయిస్టు ఉద్యమ సమాచారం చేరవేస్తున్నాడని ఆరోపణలు చేశారు. నీలకంఠ కక్కెం 15 ఏళ్లుగా భాజపా మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలోనూ ఆయనను హత్య చేసేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. ఈ దఫా రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని