logo

కళల కాణాచి భద్రాద్రి

కళలకు కాణాచిగా భద్రాచలం పేరుగాంచిందని పలువురు వక్తలు ప్రస్తుతించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో భద్రాద్రి కళాభారతి 21వ అంతరాష్ట్ర నాటకోత్సవాలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి.

Published : 06 Feb 2023 05:48 IST

నాటకోత్సవాల్లో మాట్లాడుతున్న ఆర్డీవో రత్నకల్యాణి

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: కళలకు కాణాచిగా భద్రాచలం పేరుగాంచిందని పలువురు వక్తలు ప్రస్తుతించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో భద్రాద్రి కళాభారతి 21వ అంతరాష్ట్ర నాటకోత్సవాలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఆర్డీవో ఆర్‌.రత్నకల్యాణి ప్రసంగిస్తూ ఇంత భారీ కార్యక్రమాలు నిర్వహించడం విశేషమని ప్రశంసించారు. వక్తలు మాట్లాడుతూ పట్టణంలో కళలను ఆదరించే దాతల సేవలు వెలకట్టలేనివన్నారు. గొప్ప ఆశయంతో ప్రారంభించిన నాటకోత్సవాలు దశదిశలా వ్యాప్తి చెంది భద్రాచలానికి పేరు తెచ్చాయన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సినీ గాయని తేజస్విని పాటలతో అలరించారు. నాట్యాచారిణి భాగ్యశ్రీసాయి నృత్యం సభికులను ఆకట్టుకుంది.

కరీంనగర్‌ చైతన్య కళాభారతి వారిచే ప్రదర్శించిన ఖరీదైన జైళ్లు నాటిక సభికులను ఆకట్టుకుంది. అనురాగ అప్యాయతలతో మనిషి బతకాలని, మనిషికి మనసే ప్రధానమని చెప్పే ప్రయత్నం చేశారు. పలువురిని నిర్వాహకులు సన్మానించారు. తాళ్లూరి పంచాక్షరయ్య, గొట్టిపాటి అనితరాణి, వంశీకృష్ణ, భద్రాద్రి కళాభారతి అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్‌, తిప్పన సిద్దులు, శివ శంకర్‌ నాయుడు, హరిశ్చంద్రనాయక్‌, లక్ష్మీనారాయణ, అల్లం నాగేశ్వరరావు, కె.నర్సింహారావు, రామరాజు, రమేశ్‌బాబు, జగన్నాథాచార్యులు పాల్గొన్నారు.

భాగ్యశ్రీసాయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని