logo

నిరుపేదలకు ఉచిత న్యాయసేవలు: జిల్లా జడ్జి

జిల్లా కోర్టుల్లో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌ను వర్చువల్‌ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సోమవారం ప్రారంభించారు.

Published : 07 Feb 2023 04:44 IST

లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌ను ప్రారంభిస్తున్న జిల్లా జడ్జి చంద్రశేఖరప్రసాద్‌

కొత్తగూడెం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కోర్టుల్లో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌ను వర్చువల్‌ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సోమవారం ప్రారంభించారు. కొత్తగూడెంలో జిల్లా న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ మాట్లాడుతూ న్యాయవాదులను నియమించుకోలేని నిరుపేదలకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఇప్పటికే నలుగురు న్యాయవాదులను నియమించినట్లు తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి న్యాయవాదిని నియమించుకోలేని వారికి ఉచిత న్యాయ సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం.శ్రామ్‌శ్రీ, జి.భానుమతి, ఎ.నీరజ, బి.రామారావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాద్‌రావు, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, కార్యవర్గ సభ్యులు, పీపీలు పోసాని రాధాకృష్ణమూర్తి, పీవీడీ లక్ష్మి, ఏజీపీ బాబురావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని