logo

రెండు పడక గదుల ఇల్లు మంజూరు

కొత్తగూడేనికి చెందిన బొమ్మకంటి ప్రీతి కుమారుడు, దివ్యాంగుడైన బొమ్మకంటి జయప్రకాశ్‌ శస్త్రచికిత్స కోసం సాయం చేయాలంటూ ఈ నెల 3న ‘ఈనాడు’లో ‘శస్త్రచికిత్సకు సాయం చేయరూ..’ శీర్షికన కథనం ప్రచురితమైంది.

Updated : 07 Feb 2023 06:09 IST

జయప్రకాశ్‌ తల్లి ప్రీతితో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం గ్రామీణం, న్యూస్‌టుడే: కొత్తగూడేనికి చెందిన బొమ్మకంటి ప్రీతి కుమారుడు, దివ్యాంగుడైన బొమ్మకంటి జయప్రకాశ్‌ శస్త్రచికిత్స కోసం సాయం చేయాలంటూ ఈ నెల 3న ‘ఈనాడు’లో ‘శస్త్రచికిత్సకు సాయం చేయరూ..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్‌ అనుదీప్‌ వారి వివరాలను తెలుసుకోవాలంటూ కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. వారు ప్రీతితో మాట్లాడగా ఆరోగ్యశ్రీ ద్వారా నిమ్స్‌లో శస్త్రచికిత్స త్వరలో చేపట్టనున్నారని దానికి కొంత ఆర్థిక సాయం కావాలని విన్నవించింది. ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో ఉంటున్నాని వారు ఖాళీ చేయమన్నారని, మంచానికే పరిమితమైన తన కుమారుడి పరిస్థితి చూసి ఇల్లు ఇవ్వడం లేదని వాపోయింది. సోమవారం కలెక్టరేట్‌కు పిలిపించిన కలెక్టర్‌ తక్షణమే ఆమెకు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేశారు. దీంతో ప్రీతి కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్‌లో జరిగే శస్త్రచికిత్స రానుపోను, ఇతర ఖర్చుల కోసం దాతలెవరైనా స్పందించి ఆదుకోవాలని ఆమె కోరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని