logo

ఖమ్మం దేవాదయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ సమత ఆత్మహత్యాయత్నం

ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖలో ఖమ్మం ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న సమత మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు.

Published : 07 Feb 2023 13:56 IST

ఖమ్మం సాంస్కృతికం: ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖలో ఖమ్మం ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న సమత మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఖమ్మం గ్రామీణ మండలం మారెమ్మగుడి ట్రస్ట్‌ బోర్డు విషయంలో తనకు సమాచారం ఇవ్వలేదని ఖమ్మం గ్రామీణ మండల భారాస అధ్యక్షుడు బెల్లం వేణు కుసుమంచి శివాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారనికి వెళ్తున్న సమయంలో వేణు తనకు ఫోన్ చేశారని తెలిపారు. మారెమ్మగుడి ట్రస్ట్ బోర్డు గురించి మాకెందుకు చెప్పలేదని ప్రశ్నించగా.. ఈ విషయమై ఆలయ నోటీసు బోర్డులో ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు పలు కార్యాలయాల్లో అంటించామని సమత తెలిపారు. అయినప్పటికీ తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని బెల్లం వేణు ఇన్‌స్పెక్టర్‌పై అరిచారు. దీంతో ఆమె మండల అధికారి సమాధానమిస్తారని తెలిపారు. దీంతో మనస్తాపం చెంది మాత్రలు వేసుకున్నారు. తర్వాత ఖమ్మం కాలువ ఒడ్డు వద్ద ఉన్న దేవాదయ శాఖ కార్యాలయానికి వచ్చి విలేకర్లతో మాట్లాడారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా వెనుతిరిగి వచ్చి ఆలయ ఉద్యోగులకు విషయం చెప్పారు. దీంతో వాళ్లు ఆమెను ఆటో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని