Vijaya Dairy: విజయ డెయిరీలో మరో కుంభకోణం
ఉమ్మడి ఖమ్మం జిల్లా ‘విజయ డెయిరీ’ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పలు రకాల కుంభకోణాలతో సంస్థ పరిస్థితి దారుణంగా ఉంది. పాల అమ్మకాల బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి.
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లా ‘విజయ డెయిరీ’ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పలు రకాల కుంభకోణాలతో సంస్థ పరిస్థితి దారుణంగా ఉంది. పాల అమ్మకాల బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. నిర్వహణ ఖర్చులు సరైన సమయంలో విడుదల కాకపోవటంతో రోజువారీ కార్యక్రమాలకూ ఇబ్బందికరంగా ఉంది. నిత్యం పాల అమ్మకాలు జరుపుతున్న పంపిణీదారులు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఇప్పుడు సుమారు రూ.23 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెండింగు బకాయిలు సంస్థకు గుదిబండగా మారాయి. మరో వైపు రూ.30 లక్షల పాల అమ్మకాలకు సంబంధించిన రికార్డులు మాయం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
బకాయిలతో కుంచించుకుపోతున్న సంస్థ...
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పాల పరిధిలో పాల అమ్మకాల కోసం పంపిణీదారులుగా రెండు ఏజెన్సీలను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నియమించింది. వీటికి లీటరుకు రూ.7 కమీషన్ చెల్లిస్తారు. అమ్మకాల పద్ధతి(క్యాష్ అండ్ క్యారీ)లో ఏరోజు డబ్బులు అదేరోజు చెల్లించి డెయిరీల నుంచి పాలు తీసుకెళ్లాలి. స్థానిక మార్కెట్‌తో పాటు ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సరఫరా చేస్తారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా, పేరుకుపోయిన పాల అమ్మకాల బకాయిలు, రోజువారీ పద్ధతిలో చెల్లించేందుకు మొండికేస్తున్నారు. దీంతో బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. ఖమ్మంలో పంపిణీ చేసే ఏజెన్సీ రూ.23 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.3 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.
దస్త్రాలు మాయం?...
2017-18 సంవత్సరానికి సంబంధించి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన పాల బకాయిలు సుమారు రూ.30 లక్షలకు సంబంధించి డెయిరీలో వివరాలు లేకుండా రికార్డులు మాయం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో పెద్ద ఎత్తున నిధుల గోల్‌మాల్ చేసినట్లు ఆరోపణలున్నాయి. డెయిరీపై నియమించిన ప్రత్యేక అధికారి తూతూ మంత్రంగా రావటం, వెళ్లటం తప్ప ఇలాంటి వాటిపై చర్యలు తీసుకున్నట్లు లేదు. ఈ డబ్బు ఎలా వసూలు చేయాలనే విషయమై ఇప్పుడున్న అధికారులు తల పట్టుకుంటున్నారు.
పొరుగు సేవల ఉద్యోగి హస్తం...
భారీగా పెరిగిన పాల బకాయిలకు వెనక ఇక్కడ పని చేస్తున్న ‘పొరుగు సేవల ఉద్యోగి’ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తప్పుడు నివేదికలు చూపిస్తూ ఏజెన్సీల బకాయిలు ఏమీ లేవని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఐదేళ్ల నుంచి పేరుకుపోయిన బకాయిలపై స్థానిక లేదా రాష్ట్రస్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం దారుణమైన విషయం. ఇక్కడ ప్రత్యేక అధికారి ఉన్నప్పటికీ కేవలం పాల నాణ్యత తప్ప ఇతర ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టినట్లు లేదు.
రికార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నాం
డాక్టర్ ఎ.కుమారస్వామి, ఉప సంచాలకుడు, విజయ డెయిరీ, ఖమ్మం
అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాకు సంబంధించి ఐదేళ్ల నుంచి కనిపించకుండా పోయిన రికార్డుల గురించి సంబంధిత ఉద్యోగులతో మాట్లాడాం. వాటిని సమర్పించాలని ఆదేశించాం. ఇంత వరకు ఇవి దొరకలేదు. ఈ రికార్డులు దొరికితేనే రూ.30 లక్షల బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రెండు జిల్లాల్లో పాలు సరఫరా చేస్తున్న రెండు ఏజెన్సీలకు సంబంధించి సుమారు రూ.26 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది. వాటిని త్వరలోనే వసూలు చేస్తాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
-
Crime News
Vizag: విశాఖ జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలుడి మృతి
-
Ap-top-news News
Andhra News: ఈ-ఆటోల తరలింపు ఎలా?.. తల పట్టుకున్న అధికారులు
-
Crime News
Vizag: విశాఖ రైల్వే స్టేషన్లో 18 నెలల చిన్నారి కిడ్నాప్
-
Politics News
TDP: లోకేశ్‌కు చిన్న హాని జరిగినా జగన్‌దే బాధ్యత