logo

అనర్హత వేటు ఓ కుట్ర: పువ్వాళ్ల

ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు  భాజపా కుట్రలో భాగమేనని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ ఆరోపించారు.

Published : 26 Mar 2023 03:39 IST

మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

ఖమ్మం కమాన్‌బజార్‌: ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు  భాజపా కుట్రలో భాగమేనని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఖమ్మంలోని డీసీసీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పువ్వాళ్ల మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. రాహుల్‌గాంధీ జోడో యాత్ర తర్వాత కక్ష సాధింపులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు ఎండీ జావీద్‌ మాట్లాడుతూ  కేంద్రం పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాహుల్‌పై వేటును పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మైనార్టీ, ఎస్సీ సెల్‌ బాధ్యుడు హుస్సేన్‌, బొందయ్య, మద్ది వీరారెడ్డి, రవికుమార్‌, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, లకావత్‌ సైదులు నాయక్‌, పల్లెబోయిన భారతి, నగర నాయకులు కనకరాజు, ఆనందరావు, గౌస్‌, నాగేశ్వరరావు, అనిల్‌కుమార్‌, సూరయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని