logo

విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

విద్యుదాఘాతానికి గురై తన పొలం వద్దనే ఓ రైతు మృత్యువాత పడిన సంఘటన జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

Published : 26 Mar 2023 03:39 IST

బానోత్‌ లింగా

జూలూరుపాడు, న్యూస్‌టుడే: విద్యుదాఘాతానికి గురై తన పొలం వద్దనే ఓ రైతు మృత్యువాత పడిన సంఘటన జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోత్‌ లింగా(70) వరి పొలంలోని మోటారు స్విచ్‌ ఆఫ్‌ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో వర్షం కురుస్తుండటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. లింగా ప్రతి రోజు నీటి తడులు కల్పించేందుకు మోటారును ఆన్‌ చేసి ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్లి స్విచ్‌ను నిలిపివేస్తారు. ఈ క్రమంలోనే వర్షం కురుస్తున్న సమయంలో మోటారును బంద్‌ చేసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. సమీపంలోని వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెళ్లి పరిశీలించగా విగతజీవిగా పడిఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు