logo

భక్తులకు నచ్చేలా శ్రీరామనవమి ఏర్పాట్లు

భక్తులు నచ్చేలా భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి- పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు.

Published : 26 Mar 2023 03:39 IST

ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనుదీప్‌, అధికారులు

భద్రాచలం: భక్తులు నచ్చేలా భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి- పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. 28న మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని ఆదేశించారు. ప్రముఖులు, సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. ఏర్పాట్లను ఆలయం వద్ద శనివారం పరిశీలించారు. మిథిలా మండపంలోని 26 సెక్టార్లలో 30, 31న విధులు నిర్వహించే సిబ్బంది సకాలంలో చేరుకోవాలని తెలిపారు. విద్యుత్తు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 70 కౌంటర్లలో తలంబ్రాలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. గోదావరి స్నానాల రేవు వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. హోటళ్లలో ఆహార పదార్థాల ధరల పట్టికలను ప్రదర్శించేలా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. దూర ప్రాంతాల భక్తులకు తగిన సమాచారం చేరవేయాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం అందుబాటులో ఉంటుందని చెప్పారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌, ఈవో రమాదేవి, ఆర్డీవో రత్నకల్యాణి, డీపీవో రమాకాంత్‌, ఉద్యాన అధికారి మరియన్న, ఈఈ రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని