logo

ఎస్సై, కానిస్టేబుల్స్‌ అభ్యర్థులకు ముగిసిన ఉచిత శిక్షణ

వచ్చేనెలలో జరగనున్న ఎస్సై, కానిస్టేబుల్స్‌ ఉద్యోగాల ప్రధాన రాత పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు వంద మంది అభ్యర్థులకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెణ్నెల్లుగా నిర్వహిస్తున్న ఉచిత ఉచిత శిక్షణ శనివారం ముగిసింది.

Published : 26 Mar 2023 03:39 IST

ఎస్పీ వినీత్‌తో ఉచితంగా పుస్తకాలు పొందిన అభ్యర్థులు

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: వచ్చేనెలలో జరగనున్న ఎస్సై, కానిస్టేబుల్స్‌ ఉద్యోగాల ప్రధాన రాత పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు వంద మంది అభ్యర్థులకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెణ్నెల్లుగా నిర్వహిస్తున్న ఉచిత ఉచిత శిక్షణ శనివారం ముగిసింది. కొత్తగూడెం ఐఎంఏ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ వినీత్‌ మాట్లాడుతూ పోలీసు శాఖలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైనప్పట్నుంచి అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేసిందన్నారు. ప్రిలిమినరీలో 200 మందికి ఉచిత శిక్షణ ఇవ్వగా 170 మంది మెయిన్స్‌కి ఎంపికయ్యారన్నారు. ఈవెంట్్సల్‌ 270కి గాను 210 మంది అర్హత సాధించారన్నారు. ప్రధాన పరీక్షలకు 60 రోజుల శిక్షణ ఇచ్చామన్నారు. అశ్వారావుపేట, గుండాల తదితర దూరప్రాంతాల అభ్యర్థులైన 45 మందికి ఉచిత వసతి సదుపాయాన్నీ కల్పించి ప్రోత్సహించిన అధికారులను ఎస్పీ అభినందించారు. ఏప్రిల్‌ 9న ఎస్సై, 30న కానిస్టేబుల్‌ అభ్యర్థులకు పరీక్ష జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన వారు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఉచితంగా మెటీరియల్‌ పంపిణీ చేశారు. తరగతుల నిర్వహణకు ముందుకొచ్చిన శ్రీమేధ స్టడీ సర్కిల్‌ ఛైర్మన్‌ శివప్రసాద్‌ను, అన్ని సదుపాయాలు కల్పించిన ఏఆర్‌ అడిషనల్‌ ఏసీపీ విజయ్‌బాబు, ఆర్‌.ఐ. నాగేశ్వరరావులను వినీత్‌ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్‌, ఆర్‌.ఐ. కామరాజు, సుధాకర్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని