logo

‘మానవులకు ఆత్మ పోషణ అవసరం’

మానవులకు శరీర పోషణ ఎంత ముఖ్యమో ఆత్మపోషణ సైతం అంతే అవసరమని త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్‌స్వామి పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 04:02 IST

ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీరామానుజ జీయర్‌స్వామి, వైష్ణవ సేవా సంఘం బాధ్యులు

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: మానవులకు శరీర పోషణ ఎంత ముఖ్యమో ఆత్మపోషణ సైతం అంతే అవసరమని త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్‌స్వామి పేర్కొన్నారు. నగరంలోని ఓ వేడుకల మందిరంలో ఖమ్మం శ్రీవైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీశోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పంచాంగం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌతిక సేవలే కాకుండా శ్రీవైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. అనంతరం పలు రంగాల్లో నిష్ణాతులైన వైష్ణవ పెద్దలు 21 మందిని ఉగాది పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కేఐఆర్‌ ఫౌండేషన్‌ బాధ్యులు బానోతు కీమా, రాంబాబు ఆధ్వర్యంలో 200 మందికి భగవద్గీత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోదండ రామాచార్యులు, సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేషభట్టార్‌ రఘునాథాచార్యస్వామి, కొదమసింహం రవికిరణాచార్యులు కార్యవర్గ అధ్యక్షుడు మరింగంటి భార్గవాచార్యులు, ఉపాధ్యక్షుడు నల్లాన్‌ రామకృష్ణమాచార్యులు, కన్వీనర్‌ శ్రీనివాసచార్యులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు