logo

అలరించిన సంగీత విభావరి

స్వర మాధురి కల్చరల్‌ యూనిట్‌ ఖమ్మం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది.

Published : 27 Mar 2023 04:02 IST

ఎన్టీఆర్‌, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న అతిథులు, నిర్వాహకులు

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్వర మాధురి కల్చరల్‌ యూనిట్‌ ఖమ్మం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. తొలుత అతిథులు, నిర్వాహకులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నట సార్వభౌమ ఎన్టీ రామారావు, ప్రముఖ సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, పద్మభూషణ్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెదేపా సీనియర్‌ నాయకుడు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ నటించిన చిత్రాల్లోని గీతాలతోపాటు అలనాటి మధుర గాయకులు ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాటలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. స్వర మాధురి యూనిట్‌ గాయకులు ఆలపించిన గీతాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా నాయకులు కేతినేని హరీశ్‌, నల్లమల రంజిత్‌, యూనిట్‌ అధ్యక్షుడు ఆదిరాజు పురుషోత్తమరావు, సభ్యులు ఆకుల గణపతిరాజు, వీవీ రెడ్డి, కె.జనార్దన్‌రావు, పిన్నెల్లి యాదగిరి, జాఫర్‌, ప్రకాశ్‌, మోహన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని