logo

జల ప్రసాదం ప్రారంభం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏర్పాటుచేసిన జలప్రసాదాన్ని మంత్రి  ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు

Published : 30 Mar 2023 05:07 IST

జలప్రసాదం ప్లాంట్‌ వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అధికారులు

భద్రాచలం, భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏర్పాటుచేసిన జలప్రసాదాన్ని మంత్రి  ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.6.34 కోట్లతో తెలంగాణలో వివిధ ఆలయాల్లో దివిస్‌ ల్యాబొరేటరీస్‌ ద్వారా తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం ప్రాంతంలోనే ఆరు ప్లాంట్లను నెలకొల్పామన్నారు. కలెక్టర్‌ అనుదీప్‌, ఈవో రమాదేవి, ‘దివిస్‌’ సభ్యులు శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, తహసీల్దారు శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీతానిలయం అతిథిగృహం..

హైదరాబాద్‌కు చెందిన పీఎల్‌ రాజు భద్రాచలంలో రూ.2 కోట్లతో నిర్మించిన సీతానిలయం అతిథి గృహాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. శ్రీరామ దివ్యక్షేత్రంలో అతిథిగృహాన్ని అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారని కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని