logo

పేదింట ప్రతిభా సుమం

పేదింట పుట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతూ ప్రతిభతో మెరుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు ముందంజలో ఉండేవారు.

Updated : 26 May 2023 06:26 IST

సాధం రామకృష్ణ

మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: పేదింట పుట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతూ ప్రతిభతో మెరుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు ముందంజలో ఉండేవారు. గురువారం ప్రకటించిన తెలంగాణ ఎంసెట్‌లో ఫలితాల్లో 237వ ర్యాంకు సాధించి ప్రశంసలు అందుకున్నారు మధిర మండలం మాటూరుపేట గ్రామానికి చెందిన సాధం రామకృష్ణ. అతడి తల్లిదండ్రులు వెంకటనారాయణ, శారద కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాటూరుపేట, మాటూరు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు పూర్తి చేశారు. చిన్నతనం నుంచి చదువులో ముందుండే రామకృష్ణ ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు మరింతగా ప్రోత్సహించారు. ఎన్‌ఎంఎంఎస్‌లో జిల్లా స్థాయి ప్రథమ ర్యాంకు, పదో తరగతిలో 10 జీపీఏ పొందారు. పాలిసెట్‌లో 37వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌లో సీవోఈ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. ఇంటర్‌ ఎంపీసీలో 980 మార్కులు పొందారు. జేఈఈ మెయిన్స్‌లో 98.98 పర్సంటైల్‌ సాధించి జేఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించారు. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించటంతో రామకృష్ణను ఎంఈఓ వై.ప్రభాకర్‌, మాటూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయికృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఎంసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లా నుంచి ఇంజినీరింగ్‌ విభాగంలో 7,500 మంది, అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగం నుంచి 5 వేల మంది హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని న్యూవిజన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన జి.నీరజ్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 98వ ర్యాంకు సాధించారు. 1,000 లోపు ర్యాంకులను వివిధ కళాశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు కైవసం చేసుకున్నారు.

జి.నీరజ్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని