logo

మూడు నంబర్ల నోట్ల ముచ్చట

అశ్వాపురం ప్రాంతానికి చెందిన పీకే జోసె రెండు రకాల వరుస నంబర్లు కలిగిన నోట్లను సేకరించారు. అతడు పాన్‌షాపును నిర్వహిస్తుంటారు.

Published : 01 Jun 2023 03:01 IST

జోసె సేకరించిన నోట్లు

శ్వాపురం ప్రాంతానికి చెందిన పీకే జోసె రెండు రకాల వరుస నంబర్లు కలిగిన నోట్లను సేకరించారు. అతడు పాన్‌షాపును నిర్వహిస్తుంటారు. తన వద్దకు వచ్చిన నోట్లను జాగ్రత్తగా గమనిస్తుంటారు. ప్రతి నోటులో ఆరు నంబర్లు ఉంటాయి. వరుసగా మూడు, అదే మాదిరి నంబర్లు కలిగిన నోట్లను సేకరిస్తున్నాడు. ఉదాహరణకు ఆరు నంబర్లలో 123 123 మాదిరి నోట్లను భద్రపరుస్తున్నారు. దాదాపుగా 13 ఏళ్లుగా సుమారు రూ.15వేల నోట్లను సేకరించారు. ఇలాంటి నోట్లు అరుదుగా దొరుకుతుంటాయి. ఇందులో రూ.2 వేలు, రూ.500, రూ.200, రూ.50, రూ.20, రూ.10నోట్లు ఉన్నాయి. ఇలాంటి నోట్ల సేకరణకు రోజూ కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలా సేకరించడం తనకు అలవాటుగా మారిందని జోసె చెబుతున్నారు.

మణుగూరు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని