logo

బొగ్గు ఉత్పత్తిలో తొలి మూడు స్థానాలు మనవే

మే నెలలో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణిలో మొదటి మూడు స్థానాల్లో ఉభయ జిల్లాల్లోని గనులు నిలవడం విశేషం.

Published : 01 Jun 2023 03:28 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: మే నెలలో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణిలో మొదటి మూడు స్థానాల్లో ఉభయ జిల్లాల్లోని గనులు నిలవడం విశేషం. అన్ని ఏరియాల్లోకెల్లా ఇల్లెందు (139 శాతం), మణుగూరు (123 శాతం) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత కొత్తగూడెం ఏరియా 115 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించి తృతీయ స్థానంలో నిలుస్తోంది. బెల్లంపల్లి, రామగుండం ఏరియాలు మే నెలలో ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించాయి. మిగిలిన శ్రీరాంపూర్‌ 93 శాతం, రామగుండం(1) 92 శాతం, రామగుండం (3) 88 శాతం, భూపాలపల్లి ఏరియా 70 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాయి. అన్నింటికన్నా తక్కువగా అడ్రియాల ప్రాజెక్టు కేవలం 36 శాతం లక్ష్యాన్ని సాధించింది. సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ బుధవారం నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో జిల్లాలోని జీఎంలను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని